![]() |
![]() |

సీనియర్ ప్రొడ్యూసర్ ఎ. సూర్యనారాయణ కన్నుమూశారు. ఎన్టీఆర్ టైటిల్ రోల్ చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'అడవిరాముడు' నిర్మాతగా ఆయన ప్రసిద్ధులు. వయోభారంతో వచ్చిన అనారోగ్యంతో కొంతకాలంగా వీల్‌చైర్‌కే ఆయన పరిమితమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సూర్యనారాయణ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
నిర్మాతగా ఆయన ఎక్కువగా పెద్ద హీరోలతో చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు, బాలకృష్ణ హీరోలుగా నటించారు. వాటిలో కె. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో తీసిన 'అడవిరాముడు' చిత్రం సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ పరంగా ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది.
శ్రీ సత్యచిత్ర బ్యానర్‌పై సోదరుడు సత్యనారాయణతో కలిసి ఆయన తహసిల్దార్ గారి అమ్మాయి (1971), ప్రేమ బంధం (1976), అడవిరాముడు (1977), కుమార రాజా (1978), కొత్త అల్లుడు (1979), కొత్తపేట రౌడీ (1980), ఏది ధర్మం ఏది న్యాయం (1982), ఉద్ధండుడు (1984), భలే తమ్ముడు (1985) తదితర చిత్రాలను ఆయన నిర్మించారు. కాగా సూర్యనారాయణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
![]() |
![]() |