మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయిత నుంచి దర్శకుడిగా మారి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న మూవీ SSMB28. ఇందులో హీరోగా మహేశ్ బాబు, హీరోయిన్ గా పూజా హెగ్డే చేస్తుంది. శ్రీలీల ఒక కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
అయితే ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఈ మూవీ సెట్ లో క్రికెట్ ఆడుతూ కనిపించిన ఒక వీడియో బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఎప్పుడూ తన స్పీచ్ లతో ఆకట్టుకునే త్రివిక్రమ్ ఇలా సరదాగా క్రికెట్ ఆడటం చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలోని సెట్ ని గమనిస్తే ఏదో ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ సీన్ల కోసం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.
ఈ వీడియోలో రంగస్థలం ఫేమ్ మహేశ్ కూడా కనిపించాడు. ఇక సెట్ లో ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నట్టుగా ఉంది. మరి ఈ సినిమాని ఆగస్టు నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.