శ్రీదేవి తనయ జాన్వీకపూర్ నటించిన సినిమా బవాల్. వరుణ్‌ధావన్‌తో కలిసి నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ తో పాటు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ వాయిదాపడింది. అందుకే ఈ తేదీని ఆక్రమించడానికి సిద్ధమవుతోంది గుమ్రా టీమ్. ఈ సినిమాలో ఆదిత్యరాయ్‌కపూర్‌తో కలిసి నటించిన మృణాల్ ఠాకూర్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది గుమ్రా. ఇందులో ఆదిత్యరాయ్ కపూర్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారు. ఇందులో మృణాల్ ఠాకూర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.``ఇంత ఆసక్తికరమైన సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. డబుల్ రోల్ చేయడమంటే, రెట్టింపు ఆసక్తి, రెట్టింపు కృషి ఉండాలి. రెట్టింపు ఆనందం కూడా కలుగుతుంది`` అని అన్నారు.
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ``కథ వినగానే నచ్చింది. తప్పకుండా ఈ సినిమా చేయాలనిపించింది. పోలీస్ ఆఫీసర్‌గా నటించాలన్నది నా చిరకాల కల. ఈ సినిమాతో అది నెరవేరింది. ఇప్పటిదాకా నేను చేసిన కేరక్టర్లన్నీ ఒక ఎత్తు. ఈ సినిమా మరో ఎత్తు`` అని చెప్పారు మృణాల్.అరుణ్ విజయ్, విద్య ప్రదీప్ నటించిన తడమ్ సినిమాకు రీమేక్ గుమ్రా. టీసీరీస్ భూషణ్ కుమార్, మురద్ ఖేతాని కలిసి నిర్మించారు. ఏప్రిల్ 7న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.జాన్వీ రాకపోయినా, ఆ స్థానాన్ని సీతారామమ్ నటి మృణాల్ భర్తీ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని అంటున్నారు నెటిజన్లు.గతేడాది సీతారామమ్ తనకు ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టిందో, గుమ్రా కూడా అంతే క్రెడిట్ తెచ్చిపెడుతుందని అన్నారు మృణాల్.