మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటంతో 'ఆచార్య' షూటింగ్ షెడ్యూళ్లు వాయిదా పడతాయని అంతా భావించారు. కానీ, మెగాస్టార్ కోసం దర్శకుడు కొరటాల ఆగలేదు. హీరో అవసరం లేని సన్నివేశాలు ముందుగా పూర్తి చేయాలని పక్కా ప్రణాళికతో చిత్రీకరణ ప్రారంభించాడు. హైదరాబాదులో ఒక ప్రయివేట్ స్టూడియోలో గురువారం 'ఆచార్య' చిత్రీకరణను పునరుద్ధరించారు.
చిరుకి కరోనా సోకిన సంగతి తెల్సిన తర్వాత ఆయనే తన అవసరం లేని సన్నివేశాలు పూర్తి చేయమని దర్శకుడికి చెప్పినట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో దర్శకుడు కొరటాల శివ పని ప్రారంభించారు. చకచకా క్యారెక్టర్ ఆరిస్టుల మీద తీయాల్సిన సీన్లు లాగిస్తున్నారట.
చిరు సెట్స్ మీదకు రావడానికి కొన్ని రోజులు టైమ్ పడుతుంది గనుక... హీరోయిన్ కాజల్ అగర్వాల్, చిరు కాంబినేషన్ సీన్లు ఇప్పట్లో తీయలేరు. సో... షూటింగుకు ఆమె అవసరం లేదు. అందుకని, మరికొన్ని రోజులు హానీమూన్ లో ఉండే విధంగా కాజల్ ప్లాన్ చేసుకున్నారట.