కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడిపోవడంతో ఎనిమిది నెలలుగా సినీ ప్రియులకు ఓటీటీ ప్లాట్‌ఫామే పెద్ద దిక్కుగా మారింది. ఈ కాలంలో నేరుగా విడుదలైన సినిమాల్లో ఒకట్రెండు మినహాయించి ఏవీ పెద్దగా వీక్షకులను అలరించలేకపోయాయి. జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్ నటించగా నేరుగా ఓటీటీలో రిలీజైన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' సినిమాలు తీవ్ర అసంతృప్తి కలిగించాయి. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన 'కృష్ణ అండ్ హిజ్ లీల', సత్యదేవ్ సినిమా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య', సుహాస్ సినిమా 'కలర్ ఫొటో ఉన్నంతలో మెరుగనిపించాయి. కానీ ఇవేవీ బ్లాక్‌బస్టర్స్ అనిపించుకోలేదు.
ఇన్నాళ్లకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఊరట కలిగించేలా ఓ సినిమా వచ్చిందనే ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఆ సినిమా సూర్య హీరోగా సుధ కొంగర డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం 'సూరారై పొట్రు'. దానికి బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. దాని తెలుగు వెర్షన్ 'ఆకాశం నీ హద్దురా'కు సైతం ప్రశంసల వర్షం కురుస్తోంది. చూసినవాళ్లంతా సినిమా సూపర్బ్ అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ సినిమా ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ క్యారెక్టర్‌లో సూర్య అద్వితీయ నటన, డైరెక్టర్‌గా సుధ కొంగర సూపర్బ్ టేకింగ్ 'ఆకాశం నీ హద్దురా' మూవీని చూడదగ్గ సినిమాగా చేశాయి.
కెప్టెన్ భక్తవత్సలం నాయుడుగా మోహన్‌బాబు, విలన్‌గా పరేష్ రావల్, సూర్య భార్య సుందరిగా అపర్ణా బాలమురళి సైతం తమ వంతు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించడంతో ఒక ఉన్నతస్థాయి చిత్రంగా ఇది నిలిచింది. దీపావళి పండుగకు వీక్షకులకు సరైన సినిమాగా వచ్చింది 'ఆకాశం నీ హద్దురా'.