![]() |
![]() |

'బాహుబలి-ది బిగినింగ్', 'బాహుబలి-ది కంక్లూజన్' చిత్రాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్'లు ఏమాత్రం మెప్పించలేకపోయాయి. అయినా పాన్ ఇండియా స్టార్ గా ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక మరోవైపు ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన 'ఆది పురుష్' చిత్రం వీఎఫ్ఎక్స్ మూలంగా ఆలస్యం అవుతూ వస్తోంది. కొత్తగా వీఎఫ్ఎక్స్ కోసం ఏకంగా మరో 100 కోట్లను కేటాయించారు.
ఇలా చూసుకుంటే ప్రభాస్ చిత్రాలకు ముందుగా అనుకున్న స్థాయిలో కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా నిర్మాతలకు తలనొప్పిగా మారింది. ఏ చిత్రం కూడా అనుకున్న సమయానికి అనుకున్న బడ్జెట్లో పూర్తి కావడం లేదనడం అతిశయోక్తి కాదు.
ఇక విషయానికి వస్తే.. హోం బలే ప్రొడక్షన్ సంస్థ తెలుగులో నేరుగా తీస్తున్న చిత్రం 'సలార్'. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తీసుకున్నప్పటికీ పూర్తి దృష్టి మాత్రం తెలుగుపై కేంద్రీకృతమై ఉంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కనీసం టీజర్ అయినా విడుదల చేయండి అని వేడుకుంటున్నారు. పోస్టర్స్ మాత్రం బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి.
కాగా ఈ చిత్రానికి మొదట హోం బలే ప్రొడక్షన్ సంస్థ 250 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. కానీ తర్వాత ఈ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా ఈ మూవీ బడ్జెట్ 400 కోట్లు అని తెలుస్తోంది. దాంతో ఈ చిత్రాన్ని కూడా సలార్ పార్ట్ 1, సలార్ పార్ట్ 2 గా విడుదల చేసే ఉద్దేశంలో నిర్మాతలు ఉన్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
మరి 400 బడ్జెట్ కోట్ల బడ్జెట్ కేటాయిస్తే దానికి తగ్గ వసూళ్లు వస్తాయా? ఈ సినిమా అయినా హిట్ అవుతుందా లేదా కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగులుతుందా? అని ఫాన్స్ లో ఆందోళన మొదలైంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' విజయాలతో జోష్ మీదున్న శృతిహాసన్ హీరోయిన్ పాత్రను చేస్తోంది. ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫ్రాంచైజీ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |