![]() |
![]() |

'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత 'వీరసింహారెడ్డి'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా 11 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. త్వరలోనే 'అఖండ'ను దాటేసి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలవనుంది.
వరల్డ్ వైడ్ గా రూ.73 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన వీరసింహారెడ్డి.. మొదటి రోజే ఏకంగా రూ.31 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది. రెండో రోజు నుంచి ఆ స్థాయి జోరు చూపించకపోయినా మంచి వసూళ్లు అయితే రాబడుతూ వస్తోంది. దీంతో 11 రోజుల్లో దాదాపు 74 కోట్ల షేర్ రాబట్టి బాలకృష్ణకు మరో క్లీన్ హిట్ ని అందించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 11 రోజుల్లో 'వీరసింహారెడ్డి' రూ.63.23 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.16.60 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.15.90 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.30.73 కోట్ల షేర్ గా ఉన్నాయి. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.4.75 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.5.70 కోట్ల షేర్ తో కలిపి.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.73.68 కోట్ల షేర్ రాబట్టింది.
రూ.75 కోట్ల షేర్ తో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'అఖండ' ఉంది. ఇప్పుడు ఆ వసూళ్లను 'వీరసింహారెడ్డి' దాటేసే అవకాశం కనిపిస్తోంది.
![]() |
![]() |