![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ దళపతి నటించిన వారీసు చిత్రం తమిళనాడులో ఇప్పటికే విడుదల అయింది. యావరేజ్ టాక్ ను సాధించిన ఈ చిత్రం భారీ కలెక్షన్ సాధిస్తుంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం బాగా పుంజుకొని ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దానికి అనుగుణంగానే వారీసు చిత్రానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. తలపతి నటించిన ఈ వారీసు చిత్రంలో కుష్బూ కూడా నటించిందని సమాచారం.
షూటింగ్ స్పాట్ లో విజయ్ తో పాటు రష్మిక మండన్న తో కుష్బూ తీసుకున్న సెల్ఫీ ఫోటో లీకైన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రంలో కుష్బూ కీలక పాత్రలో నటిస్తోందని ప్రచారం జరిగింది. తీరా చిత్రం చూస్తే అందులో కుష్బూ కనిపించలేదు. కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం మొదటగా ఈ చిత్రంలో కుష్బూ చేత హీరో విజయ్ తల్లిగా నటింప చేశారు. కానీ తల్లి కొడుకులుగా వీరిద్దరి మధ్య సరైన ఎమోషన్స్ పండకపోవడంతో కుష్బూను రిప్లేస్ చేశారట. ఆమె స్థానంలో సహజనటి జయసుధ నటించిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కాగా దళపతి చిత్రంలో జయసుధ పాత్ర చాలా బాగా ఉందని ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా దిల్ రాజు నిర్మించిన చిత్రాలలో జయసుధ నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇదే సెంటిమెంటు తెలుగులో వారసుడు చిత్రానికి కూడా కలిసి వస్తుందని తమిళనాడు చిత్రానికి సరి సమానంగా తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని దిల్ రాజు ఎంతో నమ్మకంతో ఉన్నాడు. కాగా తెలుగులో విపరీతమైన విమర్శల పాలైన ఈ చిత్రం మెల్లిగా పుంజుకుంటున్నట్లు సమాచారం. మరి ఆ నమ్మకం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది....!
![]() |
![]() |