![]() |
![]() |

సంక్రాంతి వార్ వన్ సైడ్ గా మారిందా అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. ఈ సంక్రాంతికి మొత్తంగా ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో మూడు చిత్రాలు తెలుగు చిత్రాలు కాగా, రెండు డబ్బింగ్ చిత్రాలు. తెలుగులో వచ్చిన చిన్న చిత్రంగా సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక దిల్ రాజు పట్టు పట్టి మరి తమిళ్‌లో తాను తీసిన వారిసూ చిత్రాన్ని తెలుగులో వారసుడుగా విడుదల చేశారు.
మొదట ఏకంగా జనవరి 12వ తారీకున విడుదల కావాలని భావించించారు. కానీ అదే తేదీన బాలకృష్ణ వీరసింహారెడ్డి రిలీజైన విషయం తెలిసిందే. వారసుడు చిత్రాన్ని 12 నుంచి 14వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు దిల్ రాజు. ఇక భారీ వ్యయంతో ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య నటించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. అంతేకాదు ఈ చిత్రాల ద్వారా వారు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు.
భారీగా బడ్జెట్ కేటాయించడంతో సొంతంగా నైజాం ఏరియాలో రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ ను కూడా ఎంతో అగ్రెసివ్ గా చేపట్టారు. అదే సమయంలో దిల్ రాజు కోలీవుడ్ స్టార్ అయిన విజయ్ తో తాను తీసిన వారసుడు చిత్రాన్ని కనీసం ఒక మోస్తరుగా కూడా ప్రమోట్ చేయలేకపోయారు. విజయ్ నుండి కూడా ఆయనకు సరైన సహకారం లభించలేదు. దాంతో సహ నటీనటులతో ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకొని తూతూ మంత్రంగా అయిందనిపించారు. మైత్రి మూవీ మేకర్స్ చిరు, బాలయ్య చిత్రాలపై భారీ బడ్జెట్లో కేటాయించడంతో వారు కూడా కాస్త మొదట్లో తడబడ్డారు. కానీ సంక్రాంతి సీజన్‌లో ఈ రెండు చిత్రాలు అత్యంత భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకొని పోతున్నాయి. రికార్డులు సృష్టిస్తున్నాయి.
థియేటర్లు కళకళలాడుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ట్రేడ్ వర్గాల లెక్కలు థియేటర్ల వద్ద ప్రేక్షకుల కురిపిస్తున్న కాసులు వీటికి సాక్షంగా నిలబడుతున్నాయి. ఈ రెండు చిత్రాలు 100 కోట్లను దాటి రెండు వందల కోట్ల దిశగా సాగుతున్నాయి. దాంతో ఈసారి సంక్రాంతికి వారు వన్ సైడ్ అయిందని ఇంతకాలం తెలుగు పరిశ్రమను ఏలుతున్నానని భావించిన దిల్ రాజుకు మైత్రి మూవీ మేకర్స్ సరైన గుణపాఠం చెప్పి ఆయన గుత్తాధిపత్యాన్ని సవాలు చేసిందని అంటున్నారు. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ ఈ పోటీలో ఏకపక్షంగా విజయం సాధించిందని చెప్పాలి.
![]() |
![]() |