![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ చిత్రంతో ఆయనకు విపరీతమైన ఇమేజ్, క్రేజ్ సొంతం అయ్యాయి. దాంతో ఆయన తన తదుపరి చిత్రాలను ఆర్ఆర్ఆర్ కు సరితూగేలా ఎంపిక చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆచార్యతో దెబ్బ తిన్న ఆయన మరోసారి అలాంటి పొరపాటుకు చోటివ్వకూడదని భావించాడు. ప్రస్తుతం దేశం గర్వించదగ్గ దర్శకుడు, ఏస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఒక విధంగా రామ్ చరణ్ తో ముందుగా సినిమాలు తీయాలని ప్లాన్ చేసుకున్న వారందరు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో చరణ్ విషయంలో హీరో సమీకరణాలన్నీ మారిపోవడంతో ఇరకాటంలో పడ్డారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్లో ఉన్న సమయంలోనే యూవీ క్రియేషన్స్ వారు రామ్ చరణ్ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఆ తరువాత జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేశాడు గౌతమ్ తిన్ననూరి. కానీ ఈ చిత్రం అక్కడ అనుకున్నంత విజయం సాధించలేదు. దానికి తోడు గౌతమ్ తిన్ననూరితో అనుకున్న ప్రాజెక్టు రామ్ చరణ్ కాదనడానికి చాలా కారణాలు ఉన్నాయట. ఇందులో మొదటిది ఇందులోని హీరో పాత్ర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఇది కూడా ఒక పీరియాడికల్ స్టోరీ. ఇలా తీసుకుంటే ఆర్ఆర్ఆర్ చిత్రంలో కూడా అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ బ్రిటిష్ వారికి అండగా ఉండే పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించారు. ఇది ఎంతో పవర్ఫుల్ గా రూపొందింది. దానికి తోడు గౌతమ్ తిన్ననూరి సినిమా తరహాలోనే ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా ఓ పీరియాడికల్ మూవీ. ఈ కారణాల వల్ల గౌతమ్ తిన్ననూరితో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయాల్సిన ప్రాజెక్టును రామ్ చరణ్ పక్కన పెట్టారు అని తెలుస్తోంది.
ప్రస్తుతం అదే కథతో విజయ్ దేవరకొండ హీరోగా ఆయన 12వ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా VD12 వర్కింగ్ టైటిల్ పేరుతో విడుదల అయింది. మొత్తానికి చరణ్ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేది తెలియాలంటే గౌతమ్ తిన్ననూరి- విజయ్ దేవరకొండ ల చిత్రం విడుదల అయ్యేవరకు వేచి చూడాలి. ఇక ఈ VD12 మూవీని సితార ఎంటర్టైన్మెంట్ పతాకం తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో భారీగా రూపొందుతోంది.
![]() |
![]() |