శింబును ఆయన ఫ్యాన్స్ లిటిల్ సూపర్‌స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. అతడి యాక్టింగ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తరహాలోనే స్టైల్, క్లాస్ మిక్స్ అయి ఉంటాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం శింబు తాజా చిత్రం 'ఈశ్వరన్'లో రజనీ తరహా ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందట. 'కాలా'లో అయితే ఏ విధంగా రజనీ ఇంట్రడక్షన్ సీన్‌లో క్రికెట్ మ్యాచ్ ఉంటుందో, ఈశ్వరన్‌లోనూ శింబు ఇంట్రడక్షన్ సీన్‌లో క్రికెట్ మ్యాచ్ ఉంటుందట. మోషన్ పోస్టర్‌లో వినిపించిన థీమ్ మ్యూజిక్కే శింబు ఇంట్రడక్షన్ సీన్‌కు ఉంటుందని వినికిడి.
సుశీంద్రన్ డైరెక్ట్ చేస్తోన్న 'ఈశ్వరన్' మూవీలో తన పార్ట్‌ను శింబు పూర్తి చేశాడు. అతని యాక్షన్ చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగించేందుకు టీజర్‌ను విడుదల చేస్తున్నారు. 2021 పొంగల్‌కు థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విలేజ్ డ్రామాగా తయారవుతున్న 'ఈశ్వరన్'లో లవ్, కామెడీ, యాక్షన్ సమపాళ్లలో ఉంటాయంటున్నారు. శింబు జోడీగా ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కనిపించే ఈ మూవీలో భారతీరాజా, బాల శరవణన్ కీలక పాత్రలు చేస్తున్నారు.