గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్‌లో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ గుర్తుంది కదా! అందులో దర్శకుడి పాత్రలో తమిళ హీరో అధర్వ నటించారు. యాక్చువల్లీ... ఇది తమిళ సినిమా ‘జిగర్తాండ’కు రీమేక్. తమిళంలో గ్యాంగ్‌స్టర్‌గా బాబీ సింహా, దర్శకుడిగా సిద్ధార్థ్ నటించారు. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారని టాక్. అందులో హీరో క్యారెక్టర్‌ను హీరోయిన్‌గా మార్చేస్తున్నార్ట. అసలు వివరాల్లోకి వెళితే...
అక్షయ్‌కుమార్ హీరోగా ఫర్హాద్ సామ్‌జి దర్శకత్వంలో సాజిద్ నదియాడ్‌వాలా నిర్మించనున్న సినిమా ‘బచ్చన్ పాండే’. మొదట ఈ సినిమాకి తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వీరమ్’ రీమేక్ రైట్స్ తీసుకున్నారు. అయితే, ఇప్పుడు ఆ కథను పక్కనపెట్టి ‘జిగర్తాండ’ కథతో ‘బచ్చన్ పాండే’ చేస్తున్నారని టాక్. తెలుగులో అధర్వ, తమిళంలో సిద్ధార్థ్ పోషించిన పాత్రను హిందీలో కృతీ ససన్ చేత చేయిస్తున్నార్ట. క్యారెక్టర్ జెండర్ మార్చారు. హీరో క్యారెక్టర్‌ని హిందీలో హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇంకెన్ని మార్పులు చేస్తారో?!