మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'క్రాక్', 'ఖిలాడి' చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటిలో 'క్రాక్' ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఇక 'ఖిలాడి' ఇటీవలే పట్టాలెక్కింది. కాగా మరోవైపు టాలెంటెడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావ్ కాంబినేషన్ లోనూ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారట రవితేజ.
కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ వెంచర్ లో రవితేజ డిటెక్టివ్ గా కనిపిస్తారని సమాచారం. అలాగే.. అతనికి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించబోతున్నారని టాక్. ఇదివరకు 'బెంగాల్ టైగర్' చిత్రంలో రవితేజ, తమన్నా జంటగా నటించిన సంగతి తెలిసిందే. మరి.. రవితేజ, నక్కిన త్రినాథరావ్ ఫస్ట్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ కామెడీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. త్వరలోనే రవితేజ, నక్కిన త్రినాథరావ్ మూవీకి సంబంధించి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది.