![]() |
![]() |

ఈ పొంగల్ రేసులో కోలీవుడ్ స్టార్ తలా అజిత్ నడిచిన తునీవు చిత్రం విడుదల కాయింది. అదే రోజున మరో కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ నటించిన వారీసు చిత్రం దీనితో పోటీకి వచ్చింది. ఈ రెండు చిత్రాల మధ్య కోలీవుడ్లో బాక్స్ ఆఫీస్ వార్ జరుగుతోంది. నువ్వా నేనా అన్నట్టు ఈ రెండు చిత్రాలు పోటీపడ్డాయి. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా అజిత్ నటించిన తునివు చిత్రం రూపొందగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వారీసు చిత్రం విడుదల అయింది. అయితే మొదటి రెండు రోజులు మాత్రం తల అజిత్ నటించిన తునివు చిత్రం వారిసు చిత్రం కంటే పై చేయి సాధించింది. ఐదు కోట్ల ను తునీవు చిత్రం వారీసు కంటే ఎక్కువగా కొల్లగొట్టిందని కోలీవుడ్ మీడియా అంటుంది.
అదే సోలోగా వచ్చి ఉంటే అజిత్ ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టేవాడని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ వచ్చిన ఓపెనింగ్స్ లో 40% వారీసు చిత్రం కైవసం చేసుకోవడంతో అనుకున్న రేంజ్ లో ఈ చిత్రం వసూలు చేయలేకపోయింది. మొత్తానికి విజయ్ అజిత్‌లలో తొలి రెండు రోజులు అజిత్ విజేతగా నిలిచారు. బాక్సాఫీస్ వద్ద ఆయన విజయ్ ని క్రాస్ చేశారు. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేదా వారీసు చిత్రం లాంగ్ రన్ లో పుంజుకొని తునివుకు పోటీగా ఓ మెట్టు పైన ఉంటుందా అనేది వేచి చూడాలి. తునివు చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా వారీసు చిత్రానికి తెలుగు దర్శకుడైన వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.
తూనీవు చిత్రాన్ని బోనీకపూర్, జీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. వారిసూ చిత్రాన్ని తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించడం విశేషం.కాగా అజిత్ కెరీర్ లో వాలిమై చిత్రం అత్యధిక కలెక్షన్స్ సాధించిన మొదటి చిత్రంగా స్థానం సంపాదించింది. తూనీవు చిత్రం రెండో స్థానంలో కొనసాగుతోంది.
![]() |
![]() |