![]() |
![]() |

ఒకనాటి స్టార్ హీరోయిన్, సహజనటిగా పేరొందిన జయసుధ గురించి పరిచయం అక్కర్లేదు. అతి చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగు పెట్టి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి ఎందరో హీరోల సరసన ఆమె నటించి మెప్పించింది. తన ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ఆమె తల్లి పాత్రలు చేస్తూ అభిమానులను మెప్పిస్తుంది.
తాజాగా కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ నటించిన వారీసు చిత్రంలో ఆయనకు తల్లిగా నటించింది. జయసుధ అలియాస్ జయసుధ కపూర్ అలియాస్ సుజాత నిడదవోలు తన కెరీర్‌లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలలో కూడా నటించింది. ఐదు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను సొంతం చేసుకుంది. జ్యోతి, ఇది కథ కాదు, ప్రేమాభిషేకం, మేఘసందేశం, ధర్మాత్ముడు చిత్రాలతో ఈమె ఈమె ఈ ఘనత సాధించింది. ఇక ఆమె దక్షిణాదిలో ఫిలింఫేర్ అవార్డ్స్ లను ఐదింటిని గెలుచుకుంది.
జ్యోతి, ఆమె కథ,గృహప్రవేశం, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, కొత్త బంగారులోకం చిత్రాలతో ఈ ఘనత సాధించింది. ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ నాయకురాలిగా కూడా పేరు తెచ్చుకుంది. తెలుగు సీనియర్ నటి దర్శకురాలు స్వర్గీయ విజయనిర్మలకు ఆమె తండ్రి కజిన్ అవుతారు. ఈమె కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను మొదటిసారిగా వివాహం చేసుకుంది. కానీ విభేదాలు వచ్చి ఆ జంట విడిపోయారు. ఆ తర్వాత తెలుగులో ఉన్నత నిర్మాతగా ఉన్న వడ్డే రమేష్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతనితో కూడా విడిపోయింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది.
ఈయన 2017 లో సూసైడ్ చేసుకున్నారు. ఇక తాజాగా ఈమె ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఏ ఈవెంట్‌లో గాని ఫంక్షన్స్ కి గాని వెళ్ళినా జయసుధ అతనితోనే కలిసి వస్తోంది. దీంతో ఆమె అతన్ని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. ఆలీ కూతురు పెళ్లిలో ఈ జంట సందడి చేసింది. తాజాగా విజయ్ నటించిన వారీసు ఫంక్షన్ కి కూడా జయసుధ ఇతనితో కలిసి వెళ్ళింది. ఈ జంట ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారని అంటున్నారు. కానీ వీటిపై జయసుధ తాజాగా స్పందించింది.
తనతో పాటు వస్తున్న వ్యక్తి ఎవరో కూడా ఆమె తెలియజేసింది. అతను అమెరికాకు చెందిన వ్యక్తి. నా బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చారు. ఇండస్ట్రీలో నా ప్రాముఖ్యత తెలుసుకునేందుకు ప్రతి ఈవెంట్ కు హాజరవుతున్నారు. ఆయన పేరు ఫిలిప్పే రూయేల్స్ అని తెలియజేసింది. గత కొంత కాలం కిందట ఆమెకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. దాని ట్రీట్మెంట్ కోసం ఆమె అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆమె అమెరికాలో కొంతకాలం ఉన్నారు. చికిత్స తీసుకొని ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఆమెను ఎవరు గుర్తుపట్టలేని విధంగా తయారయింది. కానీ ఆమె ఇప్పుడిప్పుడే తన రూపురేఖలను సంతరించుకుంటుంది.
జయసుధ ఇంకా మాట్లాడుతూ నా గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో తెలుసుకున్నాడు. కానీ నాకు ఇక్కడ ఫాలోయింగ్ ఎలా ఉంది? నా సినిమాల షూటింగ్ వివరాలు తెలుసుకునేందుకు నన్ను ఫాలో అవుతున్నారు. అంతే తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ఇటీవల అమెరికా వెళ్లి అతన్ని కలిసా అని జయసుధ చెప్పుకొచ్చింది. కాగా జయసుధ, నితిన్ కపూర్ల జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు సినీ నటుడు కూడా. నితిన్ కపూర్ మరణించిన తర్వాత ఈమె తన కుమారులతోనే ఉంటూ వస్తోంది.
![]() |
![]() |