![]() |
![]() |

తొలి చిత్రం నుంచి తనదైన శైలిలో విజయాలు సొంతం చేసుకుంటూ వచ్చిన నటి సమంత. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో ది మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈమె కెరీర్లో విజయాల శాతం ఎక్కువ. మిగిలిన హీరోయిన్లకు సాధ్యం కానటు వంటి విజయాల సంఖ్యతో ఈమె లక్కీ హ్యాండ్ గా పేరు తెచ్చుకుంది. ఇలా కెరీర్ పిక్స్ లో సాగుతున్న సమయంలో తాను నటించిన మొదటి చిత్రం హీరో అక్కినేని నాగచైతన్యతను ప్రేమించి వివాహం చేసుకొంది. అలా ప్రేమ వ్యవహారం కాస్త పెళ్లి దాకా వెళ్ళింది. కానీ అతి తక్కువ కాలంలోనే వీరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఈమెకు మయోసైటీస్ అనే వ్యాధి వచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో సమంత బాగా డిప్రెషన్ లోకి వెళ్లిందట. ఆమెలో దైవచింతన పెరిగిందని అంటున్నారు. విడాకుల అనంతరం ఈమె తన స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలో చేసింది. ఎందరో ఆధ్యాత్మిక గురువులను కలిసింది. ప్రస్తుతం వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఎడమ చేతిలో జపమాలతో ఈమె కనిపిస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో ముంబై ఎయిర్పోర్ట్‌లో శాకుంతలం వేడుకల్లో కూడా ఈమె ఎడమ చేతిలో జపమాలతో దర్శనమిచ్చింది. కాగా ఈమెలో ఈ మార్పుకు దైవ చింతనకు కారణం జగ్గీ వాసుదేవ్ అని తెలుస్తోంది. ఆధ్యాత్మిక గురువుగా జగ్గీ వాసుదేవ్ కు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన తనదైన ఆధ్యాత్మిక చింతనతో దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందారు. ఆయన ఇచ్చిన సందేశంతోనే ప్రస్తుతం సమంత ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయిందని తెలుస్తోంది.
![]() |
![]() |