![]() |
![]() |

వాస్తవానికి ఈ సంక్రాంతికి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కోలీవుడ్ స్టార్లు అజిత్ నటించిన తెగింపు, విజయ్ నటించిన వారసుడు చిత్రాలతో పాటు ప్రభాస్ నటించిన ఆది పురుష్ కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రం నుంచి విడుదలైన చిన్నపాటి టీజర్ పలు విమర్శలకు దారి తీయడంతో ఈ చిత్రాన్ని మరలా రిపేర్ల కోసం ల్యాబ్‌లకు పంపారు. నాసిరకంగా ఉన్న విఎఫ్ఎక్స్ పనులను మరల మొదటి నుండి మొదలుపెట్టి పూర్తి చేసే పనిలో ఈ చిత్రం యూనిట్ ఉంది. ఇక రామాయణాన్ని, రాముడి చరిత్రను తప్పుగా చూపిస్తారా? అంటూ ఓవర్గం ఈ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాన్ని కూడా ఈ చిత్ర యూనిట్ సరిదిద్దుకోవాల్సి ఉంది.
ఇలాంటి పరిస్థితులలో ఈ చిత్రం మరో ఆరు నెలలు వాయిదా పడింది. దాంతో ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 16 కు వాయిదా పడింది. అదే కనుక ఆది పురుష్ చిత్రం ఈ సంక్రాంతి కానీ విడుదలై ఉంటే ఫలితం వేరేగా ఉండి ఉండేదని అంటున్నారు. అన్ని చిత్రాలు యావరేజ్ టాక్ తో నడుస్తున్న నేపథ్యంలో ఆది పురుష్ చిత్రం విడుదల ఉంటే ఈ చిత్రానికి కచ్చితంగా అది పెద్ద ప్లస్ పాయింట్ అయి ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, తెగింపు, వారసుడు ఇలా అన్ని యావరేజ్ చిత్రాలు గానే టాక్ తెచ్చుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆది పురుష్ గోల్డెన్ ఛాన్స్ ని మిస్ అయిందని ఆయన ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు.
![]() |
![]() |