![]() |
![]() |

ఈనెల 11వ తారీఖున కోలీవుడ్ తల అజిత్ నటించిన డబ్బింగ్ సినిమా తెగింపు బాగానే పలు థియేటర్లలో విడుదలయ్యింది. కానీ పక్క రోజే బాలయ్య 'వీరసింహారెడ్డి'గా రావడంతో సగం థియేటర్లలో చిత్రాన్ని తీసివేశారు. ఇక తాజాగా 'వాల్తేరు వీరయ్య'తో మెగాస్టార్ హంగామా మొదలు కావడంతో ఈ సినిమాకి అక్కడక్కడ ఒకటి రెండు స్క్రీన్లు తప్ప ఎక్కడ ఈ సినిమా కనిపించడం లేదు. 'కళ్యాణం కమనీయం' చిత్రం కూడా విడుదలయితే ఈ చిత్రం పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.
తెలుగులో ఇద్దరు బడా స్టార్లు ఒకేసారి బరిలోకి దిగుతున్న సమయంలో పరభాష హీరో అయినా అజిత్ సినిమాని పోటీగా డబ్బింగ్ చేసి, విడుదల చేయడం ఎంత పొరపాటో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసిన వారికి ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. తెలుగులోనే వచ్చిన చిన్న సినిమాలు అయినా ఆడుతాయేమోగానీ పక్క స్టేట్లో క్రేజ్ ఉన్న స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో ఏ మాత్రం మార్కెట్ లేకపోవడంతో ఆ ప్రభావం 'తెగింపు' మూవీ పై భారీగా పడింది. దాంతో ఈ చిత్రానికి థియేటర్లో కరువయ్యాయి.
![]() |
![]() |