![]() |
![]() |

'వాల్తేరు వీరయ్య' మూవీ చిరంజీవి స్టామినా ఏంటో తెలియజేస్తోంది. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గాని, ప్రేక్షకాదరణ గాని కించిత్తు కూడా తగ్గలేదని నిరూపిస్తోంది. ఈ చిత్రం ఆడే థియేటర్లు ఫ్యామిలీ ఆడియన్స్ తో కిక్కిరిసిపోతున్నాయి. దీన్ని అందరూ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నారు. కానీ ఈ చిత్రాన్ని ఎక్కువగా ఆదరిస్తోంది ఫ్యామిలీ ఆడియన్స్. ముసలివారి నుంచి చిన్న పిల్లల వరకు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొందరు పని కట్టుకొని ఈ చిత్రం డిజాస్టర్ అంటూ ప్రచారం చేశారు.
ఇప్పుడు వారికి ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి నోట మాట రావడం లేదంటే అతిశయోక్తి కాదేమో. చిరు ఎంటర్టైన్మెంట్ జోన్లోకి అడుగుపెడితే బాక్సాఫీస్ ఎలా బద్దలవుతుందో మరోసారి ఈ 'వాల్తేరు వీరయ్య'తో నిరూపితం అవుతోంది. ఇక ఈ చిత్రంలోని సెకండ్ హాఫ్‌ను ఓ రేంజిలోకి తీసుకొని వెళ్లడంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించారు.
'విక్రమార్కుడు' తర్వాత రవితేజను అంత పవర్ఫుల్‌గా చూపించిన చిత్రమిదని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా రవితేజ నటించిన పలు సీన్స్ రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తున్నాయి. ఆ రేంజ్‌లో ఆయన ఎమోషన్స్ పండించాడు. ఆయన ఎంట్రీతోనే ఈ చిత్రం పీక్స్‌కి కి వెళ్ళింది. అయితే మొదట ఈ పాత్రను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేయించాలని డైరెక్టర్ బాబీ అనుకున్నారట. కానీ ఈ మూవీ ఫ్లాష్‌బ్యాక్‌లో రవితేజ పాత్ర చనిపోతుంది. దాంతో చిరు పవన్ చేస్తే పెద్దగా నచ్చకపోవచ్చు. దీనిని పవన్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో..? సినిమాకే రిస్క్ అని వద్దని చెప్పారట. ఆ తర్వాత రవితేజను చిరునే స్వయంగా సజెస్ట్ చేసి ఒప్పించారు. దాని ఫలితమే నేడు 'వాల్తేరు వీరయ్య' సృష్టిస్తున్న ప్రభంజనానికి మూల కారణమైంది.
![]() |
![]() |