![]() |
![]() |

రామబాణం ప్రొమోషన్స్ కోసం రాజమండ్రి వెళ్లిన సందర్భంగా ఆలీ అతని భార్య జుబేదా అలీ గోపీచంద్ తో కాసేపు ముచ్చటించారు. "రోజురోజుకు యంగ్ ఐపోతున్నారు మీరు ఆ రహస్యం..చెప్తే మా వారిని కూడా అలా యంగ్ గా మార్చేస్తాను కదా " అని గోపీచంద్ ని అడిగింది జుబేదా. "మీ వారు యంగ్ గానే ఉన్నారు కదా. ఆలీ గారితో నా కాంబినేషన్ సక్సెస్ ఫుల్ గా ఉంటుంది ఎప్పుడూ. మేమిద్దరం చేసిన చాలా మూవీస్ హిట్స్ ఉన్నాయి. అలాగే మేము సాహసం మూవీ షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఇసుక తుఫాను రావడం వలన షూటింగ్ లో చాల కష్టపడ్డాం అంటూ అప్పటి జ్ఞాపకాలను ఇద్దరూ షేర్ చేసుకున్నారు. ఈ రామబాణం ఒక ఫామిలీ స్టోరీ.
ఆలీ గారి కామెడీ టైమింగ్ నాకు ఇష్టం..ఆయన కామెడీ చేసారంటే నాకు షూటింగ్ టైంలో నవ్వొచ్చేస్తుంది. అప్పుడు కాసేపు ఆగాక మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తాను " అని చెప్పాడు గోపీచంద్. గోపీచంద్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. వాళ్ళ నాన్న టి.కృష్ణ గారు ఈరోజు బతికి ఉంటే వీళ్ళిద్దరూ రామలక్ష్మణుల్లా ఉండేవాళ్ళు. భగవంతుడు తొందరపడి తీసుకెళ్లిపోయాడు. ఆయన ఈరోజున బతికి ఉంటే చాల పెద్ద డైరెక్టర్ అయ్యేవారు. అమ్మాయి కాపురం మూవీ చేస్తుండగా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. అలాంటి మంచి ఫామిలీ నుంచి ఒక మంచి హీరో రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గోపి జెంటిల్ మాన్, నైస్ మాన్, 24 క్యారెట్ గోల్డ్ " అని గోపీచంద్ గురించి ఆలీ చెప్పాడు. "మీ వంటలు కూడా చాలా ఫేమస్ కదా" అని జుబేదా అలీని విష్ చేసాడు గోపీచంద్.
![]() |
![]() |