![]() |
![]() |

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయనున్నారు. ఇది మలయాళ ఫిల్మ్ 'బ్రో డాడీ'కి రీమేక్ అని ఇటీవల బలంగా వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, ఇది రీమేక్ కాదని తెలుస్తోంది. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ అందించిన కథతో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.
'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్', 'హలో గురు ప్రేమకోసమే', 'ధమకా', 'దాస్ కా ధమ్కీ' వంటి సినిమాలకు రచయితగా పని చేశాడు ప్రసన్న కుమార్. దాదాపుగా ఆయన పనిచేసిన సినిమాలన్నీ కమర్షియల్ గా సక్సెస్ ని అందుకున్నాయి. ముఖ్యంగా గతేడాది విడుదలైన 'ధమకా' బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం దర్శకుడిగా నాగార్జునతో సినిమా చేసే సన్నాహాల్లో ఉన్న ప్రసన్న.. మెగాస్టార్ కోసం ఓ అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథతోనే చిరంజీవి-కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో మూవీ రూపొందనుందట. ఈ ఏడాది ప్రారంభంలో 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్. అందులో ఆయన కామెడీ టైమింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. మరోసారి అలాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తో చిరు అలరించనున్నారట.
మరోవైపు చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా చేస్తున్నారు. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత కళ్యాణ్ కృష్ణ మూవీ పట్టాలెక్కనుందట. దానితో పాటు పారలల్ గా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారని వినికిడి.
![]() |
![]() |