![]() |
![]() |

తమిళ్ మూవీ 'వినోదయ సిత్తం' తెలుగు రీమేక్ లో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఊహించని టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకి రకరకాల టైటిల్స్ పరిశీలించినట్టు వార్తలొచ్చాయి. 'దేవుడు', 'దైవం మనుష్య రూపేణ', 'దేవుడే దిగివచ్చినా' వంటి టైటిల్స్ ప్రముఖంగా వినిపించాయి. అయితే ఈ చిత్రానికి ఊహించని విధంగా 'బ్రో' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
'వినోదయ సిత్తం' తెలుగు రీమేక్ కి 'బ్రో' అనే టైటిల్ ఖరారు చేశారనే వార్తల నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు టైటిల్ క్యాచీగా ఉందని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఏంది బ్రో ఈ టైటిల్ అని కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |