![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. 'ఓజీ' మొదటి షెడ్యూల్ ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహారాష్ట్రలోని వాయ్ లేక్ వద్ద 'ఓజీ' షూటింగ్ జరుగుతుందని, అక్కడ రాజమండ్రికి చెందిన ఇద్దరు జనసైనికులను కలిశానని ట్వీట్ చేసిన పవన్.. ఓ ఫోటోని పంచుకున్నారు. అందులో జన సైనికులు బోట్ దగ్గర జనసేన జెండా పట్టుకొని నిల్చొని ఉండగా.. మార్షల్ ఆర్ట్స్ డ్రెస్ ధరించిన పవన్ వారి వైపు చూస్తూ కనిపించారు. పవన్ మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట అనే విషయం తెలిసిందే. ఆయన ఎన్నో సినిమాల్లో తన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ చూపించారు. 'ఖుషి'లో మార్షల్ ఆర్ట్స్ డ్రెస్ లో కనిపించి అదరగొట్టారు. ఇప్పుడు 'ఓజీ' కోసం మరోసారి ఆయన ఈ డ్రెస్ ధరించడం ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. అనౌన్స్ మెంట్ తోనే 'ఓజీ'పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోగా.. కేవలం షూటింగ్ లొకేషన్ లో ఫొటోలతోనే ఆ అంచనాలను రెట్టింపు చేస్తున్నారు మూవీ టీమ్.

![]() |
![]() |