![]() |
![]() |

రవితేజ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, ఆయన ఎనర్జీ లెవెల్స్, పాటలు ఫైట్స్ లో ఆయన చూపించే ఈజ్ వంటివి ఆయనను మాస్ మహారాజా గా అవతరించడంలో ఎంతో సహాయపడ్డాయి. కంటెంట్ పెద్ద బలంగా లేకపోయినా సరైన ఎంటర్టైన్మెంట్ మాస్ యాక్షన్ ధమాకా చిత్రమైతే ఆ చిత్రం ఏ స్థాయిలో హిట్ అవుతుందో ధమాకా తో పాటు ఆయన మెగాస్టార్ తో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య కూడా మరోసారి ప్రూవ్ చేసింది. సోలో హీరోగా చేసిన ధమాకా చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక వాల్తేరు వీరయ్య విజయంలో కూడా రవితేజ ది ఎంతో కీలకమైన పాత్ర. కాగా ప్రస్తుతం రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో రావణాసుర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆ వెంటనే ఆయన పీరియాడికల్ చిత్రమైన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు గా కనిపించనున్నారు. ఈ చిత్రం రవితేజ కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇక రవితేజ తదుపరి ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అనే విషయంలో హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి.
సాధారణంగా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ ఉంటారు. సినిమా సినిమాకి పెద్దగా గ్యాప్ తీసుకోరు. ఏడాదికి మినిమం మూడు నాలుగు చిత్రాలు వచ్చేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఆయనతో సినిమా చేయాలని వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని భావిస్తున్నాడట. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి హ్యాట్రిక్ ఫిలిమ్స్ తీశారు. కాగా ఆయన తాజాగా క్రాక్ మూవీకి సీక్వెల్ ను మరోసారి రవితేజతో చేయాలని ప్రయత్నిస్తున్నాడట. ఇలా రవితేజతో ఆయన డబుల్ హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నారు. మరోవైపు వాల్తేరు వీరయ్యను డైరెక్ట్ చేసిన బాబి కొల్లి కూడా రవితేజ తో మరో చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈయన ఇప్పటికే రవితేజతో పవర్, వాల్తేరు వీరయ్య చిత్రాలు చేశారు. తాజాగా మరో చిత్రంతో తొలి హ్యాట్రిక్ నమోదు చేయాలని ఆయన భావిస్తున్నారు. మరి ఇద్దరి దర్శకులలో రవితేజ ఎవరితో నటించడానికి ఓకే చెప్తాడు? ఇద్దరు దర్శకులకు ఓకే చెప్తాడా? అనేది వేచి చూడాల్సి ఉంది.
![]() |
![]() |