![]() |
![]() |

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలన్నీ అద్భుతమైన విజయాలను సాధించాయి. అపజయమనేదే ఎరుగని దర్శకునిగా ఆయన జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. అయితే ఆయన తీసిన చిత్రాలలో నితిన్ తో చేసిన సై చిత్రాన్ని కాస్ట్ ఫెయిల్యూర్ చిత్రంగా పలువురు పేర్కొంటారు. కానీ రాజమౌళి అంటే మాత్రం దానిని కూడా బ్లాక్ బస్టర్ గానే లెక్కలో వేసుకుంటారు.
ఇక రాజమౌళి చిత్రాల విషయంలో ఆయన భార్య రమా రాజమౌళిది కీలకపాత్ర. రమా రాజమౌళి రాజమౌళి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. ప్రతి సినిమాలోని సీన్లను ఏ పాత్రలో ఏ ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అనే విషయంలో భార్యాభర్తల మధ్య చర్చ సాగుతూ ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమా రాజమౌళి తన భర్త తీసిన చిత్రాలలో తనకు నచ్చని చిత్రం గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ చిత్రం నచ్చలేదని చెప్పారు.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రిల తర్వాత వచ్చిన చిత్రం ఇది. ఈ చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. రొటీన్ కథ అయినా రాజమౌళి తన ట్రీట్మెంట్ తో ఎంతో బలంగా కథనాన్ని నడిపించి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కట్టిపడేలా చేశారు. ఇక యమదొంగ చిత్రం తనకు నచ్చకపోవడానికి తన దగ్గర బలమైన కారణం లేకపోయినా నేను ఆ మూవీకి పెద్దగా కనెక్ట్ కాలేదని రమా చెప్పడం విశేషం. అయితే ఎన్టీఆర్ నటన వలన ఆ మూవీ అద్భుతంగా వచ్చిందని ఆ ఒక్క కారణంతోనే సినిమా హిట్ అయిందని ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఈ చిత్రం రాజమౌళి సొంత నిర్మాణంలో నిర్మించిన చిత్రం కావడం విశేషం. రాజమౌళికి చెందిన విశ్వామిత్ర క్రియేషన్స్ బేనర్ లో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |