![]() |
![]() |

మమతా మోహన్ దాస్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా, ప్లే బ్యాక్ సింగర్ గా, నిర్మాతగా ఈ మలయాళ కుట్టి మంచి గుర్తింపు నే సాధించింది. తెలుగు మలయాళ కన్నడ తమిళ భాషల్లో నటించింది. 55 చిత్రాలకు పైగా నటించిన ఈమెకు కొన్ని పురస్కారాలు కూడా దక్కాయి. మమతా మోహన్ దాస్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. కృష్ణవంశీ- ఎన్టీఆర్ ల కాంబినేషన్‌లో వచ్చిన రాఖీ చిత్రంలో టైటిల్ సాంగ్ ను ఈమె పాడింది. తర్వాత శంకర్ దాదా జిందాబాద్, జగడం, యమదొంగ, చందమామ, తులసి, కృష్ణార్జున, కింగ్ వంటి ఎన్నో చిత్రాలలో ఈమె పాటలు పాడిమెప్పించింది. ఇక నటిగా ఈమె తెలుగులో యమదొంగతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కృష్ణార్జున విక్టరీ కథానాయకుడు హోమం చింతకాయల రవి కింగ్ కేడి వంటి వరుస చిత్రాలు చేసింది. ఇవన్నీ స్టార్ హీరోల సరసన నటించిన చిత్రాలే కావడం విశేషం.
కాగా కొంత కాలం కిందట ఈమె క్యాన్సర్ బారిన పడింది. ఆ తరువాత దానితో పోరాడి విజయం సాధించింది. దానిని జయించింది. ప్రస్తుతం ఆమె పోషకాహార నిపుణురాలిగా సోషల్ మీడియాలో ఎంతోమందికి దిశా నిర్దేశం చేస్తుంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఆమె చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. దీని కారణంగా చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నట్టు తెలిపింది. దానికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను అని తెలిపిన ఈమె మేకప్ లేకుండా ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. ఇందులో ఆమె సూర్యుని ఉద్దేశించి ప్రియమైన సూర్యుడా నాకు గతంలో కంటే ఇప్పుడు నీ కాంతి ఎక్కువ అవసరం నేను నా రంగును కోల్పోతున్నాను నేను ప్రతిరోజు ఉదయం నీకోసం ఎదురు చూస్తుంటాను ఆ పోగ మంచులో సూర్యకిరణాలు మెరుస్తుంటే చూస్తున్నాను అవి నన్ను తాకాలని వాటికోసం బయటకు వస్తున్నాను. నాకు ఇప్పుడు వాటి అవసరం ఉంది నీ దయతో ఇక్కడ ఉన్నాను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని తెలిపింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
నువ్వు ఫైటర్ వి. నిన్ను ఇలాంటివి ఏమీ చేయలేవు అని ఒకరంటే నువ్వు గొప్ప ధైర్యవంతులివి... త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అని మమత మోహన్ దాస్ కు నెటిజన్లు ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం మమతా మోహన్ దాస్ 12 ఏళ్ల తర్వాత తెలుగులో రుద్రంగి అనే సినిమాలో నటిస్తోంది. చర్మవ్యాధులకు సూర్యకాంతి అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. సూర్య కాంతితోనే మనకు చాలావరకు చర్మ సంబంధిత రోగాలు తగ్గిపోతాయి. దాంతో ఆమె సూర్యుని రాక కోసం ప్రతిరోజు ఉదయాన్నే ఇంతగా ఎదురుచూస్తోందని అర్థమవుతుంది.
![]() |
![]() |