![]() |
![]() |

మొన్న మొన్నటిదాకా టాలీవుడ్ లో కనిపించిన సీన్ ఇప్పుడు బాలీవుడ్‌లో రిఫ్లెక్ట్ అవుతోంది. బాలీవుడ్ కి 2022 పెద్దగా కలిసి రాలేదు. అక్కడ రిలీజ్ అయిన సినిమాలు చాలా పోయాయి. నిర్మాతలు ఇప్పుడు నష్టాల బారిన పడుతున్నారు. దీని గురించి టీసీరీస్ అధినేత భూషణ్ కుమార్ స్పందించారు.
"సినిమా ఇండస్ట్రీ సిట్చువేషన్ చాలా దారుణంగా ఉంది. బాక్సాఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేయలేక ఫెయిల్ అవుతున్నాం. ఇలాంటి సమయంలో కొందరు నటీనటులు నిర్మాతల బాధలను అర్థంచేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం తాము చేసిందే చట్టం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. పారితోషికాన్ని పెంచి, నిర్మాతలను నోరు తెరవనీయకుండా చేస్తున్నారు. సినిమా బడ్జెట్ ఏంటి? మనం ఎంత తీసుకోవాలనే ఆలోచనే వారికి ఉండటం లేదు. అసలు నిర్మాతలు ఆ నష్టాలను ఎందుకు భరించాలి? ఎవరైనా సరే, సినిమాకు ఫేవర్ చేయకపోతే వారు ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు పోవచ్చు. నేను అలాంటివారిని ఉండమని బతిమలాడను. ఎప్పుడైనా విన్ విన్ సిట్చువేషన్ ఉన్నప్పుడే అందంగా ఉంటుంది. నేనొక్కడిని బతుకుతాను. నీ చావు నీది అని అంటే అందులో న్యాయం ఉండదు. అందుకే అలాంటి వారు ఎవరైనా సరే, నా ప్రాజెక్టుల నుంచి వెళ్తానంటే, నేను అడ్డు చెప్పను. వాళ్లను బయటకు పంపడానికి నా డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి" అని అన్నారు.
లాస్ట్ ఇయర్ టీసీరీస్ భూషణ్ కుమార్‌కి భూల్ భూలయ్యా2 పెద్ద హిట్ అయింది. కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు నటించిన హారర్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఆయన చేతిలో అల వైకుంఠపురములో రీమేక్ షెహ్‌జాదా, ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలున్నాయి.
![]() |
![]() |