![]() |
![]() |

బాలయ్య ఒక్కసారి కమిట్ అయ్యాడు అంటే ఇంక మాట తప్పడు మడమ తిప్పడు. ఆయనకు ఒక్కసారి కథ నచ్చిందంటే ఇక సినిమా మేకింగ్ లో ఆయన ఎలాంటి జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకోకపోవడం వలన గతంలో ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. తమ్ముడు ఫేమ్ అరుణ్ ప్రసాద్ తో తీసిన భలేవాడివి బాసు, రాంప్రసాద్ డైరెక్షన్‌లో వచ్చిన సీమ సింహం, స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన విజయేంద్ర వర్మ, ఏ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన వీరభద్ర, పరుచూరి మురళితో చేసిన అధినాయకుడు, రవి చావలి దర్శకత్వంలో శ్రీమన్నారాయణ,సత్యదేవ్ దర్శకత్వంలో లయన్, శ్రీ వాసు దర్శకత్వంలో డిక్టేటర్, మహాదేవ దర్శకత్వంలో వచ్చిన మిత్రుడు...ఇలా చాలా చిత్రాలు దారుణమైన ఫలితాలను నమోదు చేశాయి. అయినా బాలయ్య పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు.
తాజాగా ఈ సంక్రాంతికి విడుదలై అద్భుతమైన కలెక్షన్లతో దూసుకొని పోతున్న వీరసింహారెడ్డికి గోపీచంద్ మలినేని దర్శకుడు కావడం విశేషం. ఇక ఈయన త్వరలో అనీలు రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. వీరందరూ యువ దర్శకులే కావడం విశేషం. ఇక బాలయ్య తన సీనియర్ దర్శకుడైన బి గోపాల్ కి కూడా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోపక్క బింబిసారా తో మంచి హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్టతో ఓ మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా బాలకృష్ణ మరో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కు అవకాశం ఇచ్చాడని సమాచారం. అ, కల్కి, జాంబిరెడ్డి వంటి చిత్రాలను తీసిన ప్రశాంత వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం హనుమాన్ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో తేజు సజ్జ హీరోగా నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్ క్వీన్ చిత్రానికి రీమేక్ గా తమన్నాతో దటీజ్ మహాలక్ష్మి అనే చిత్రం ఎప్పుడో ప్రారంభమైన ఇప్పటివరకు పూర్తికాలేదు.
ఈ చిత్రానికి ఎందరో దర్శకులు మారారు. చివరకు ప్రశాంత్ వర్మ వద్ద ఈ చిత్రం ఆగింది. తాజాగా ప్రశాంతవర్మకు బాలయ్య అవకాశం ఇవ్వడంతో ఈ దర్శకునికి ఇదో అరుదైన అవకాశం చెప్పాలి. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన ప్రశాంత వర్మ స్క్రిప్ట్ కూడా బాలయ్యకు నచ్చిందట. ఈ స్క్రిప్ట్ బాలయ్యను ఇంప్రెస్ చేసింది కాబట్టి త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ లోపు ఆయన అనిల్ రావిపూడి, బోయపాటిశ్రీను చిత్రాలు విడుదలవుతాయి. బోయపాటి చిత్రాన్ని మరో పొలిటికల్ డ్రామాగా ఏపీ ఎన్నికలకు ముందు 2024 వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బాలయ్య ఎన్నడు లేనంత స్వింగ్‌లో ఉన్నాడనే చెప్పాలి.
![]() |
![]() |