![]() |
![]() |

'సింహాద్రి' రీరిలీజ్ కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు నటించిన 'పోకిరి', 'ఒక్కడు' సినిమాలు, పవన్ కళ్యాణ్ 'జల్సా', 'ఖుషి' సినిమాలు, ప్రభాస్ 'బిల్లా', 'వర్షం' సినిమాలు మళ్ళీ విడుదలై ఫ్యాన్స్ ని థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునేలా చేశాయి. అయితే రీరిలీజ్ ట్రెండ్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో నిరాశలో ఉన్నారు. 'ఆది', 'సింహాద్రి' సినిమాలను త్వరగా రీరిలీజ్ చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే త్వరలోనే వారి ఆశ నెరవేరనుంది.
'స్టూడెంట్ నెం.1' వంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఫిల్మ్ 'సింహాద్రి'. 2003 లో విడుదలైన ఈ సినిమా అప్పటిదాకా ఉన్న రికార్డులను తిరగరాసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా అత్యధిక కేంద్రాల్లో 175 రోజులు ఆడిన చిత్రంగా ఎప్పటికి చెక్కు చెదరని రికార్డుని నమోదు చేసింది. కేవలం 20 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ పలికించిన రౌద్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంలోని కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాటలు ఒక ఊపు ఊపాయి. 'చీమ చీమ', 'ఆంధ్రా సోడాబుడ్డి' పాటలకు థియేటర్లలో మాస్ ఊగిపోయారు. ఈ ఏడాదితో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఈ సంచలన సినిమా మరోసారి థియేటర్లలో అలరించడానికి సిద్ధమవవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది మే 20న ఈ చిత్రాన్ని 4kలో భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే 'సింహాద్రి' రీరిలీజ్ ప్రకటన అధికారికంగా రానుందని సమాచారం. ఈ వార్త అలా వచ్చిందో లేదో అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ #Simhadri4K హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. 'సింహాద్రి' రీరిలీజ్ సెలబ్రేషన్స్ కూడా 'పోకిరి', 'జల్సా', 'ఖుషి' సినిమాల రేంజ్ లో జరుగుతుందేమో చూడాలి.
![]() |
![]() |