![]() |
![]() |

ప్రస్తుతం తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమ స్టార్ హీరోల పుట్టినరోజులు కానీ లేదా ఆయా చిత్రాలు విడుదలై 20, 25 ఏళ్లయిన సందర్భంగా....ఇలా కారణం ఏదైనా సరే ఆయా చిత్రాలు, ఆయా హీరోలు నటించిన పాత చిత్రాలను సరికొత్తగా సరికొత్త టెక్నాలజీతో రీరిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'ఖుషి' చిత్రం రీ రిలీజ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. త్వరలో 'తొలిప్రేమ' చిత్రం కూడా వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ ప్రేమికుల దినోత్సవానికి ఈ చిత్రాన్ని టార్గెట్ చేస్తున్నారు.
కాగా మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఒక్కడు'ని ఇటీవల నిర్మాత ఎమ్మెస్ రాజు రీ రీలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ నటించిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. 2003లో ఈ చిత్రం విడుదల అయింది. తాజాగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా సినిమా మంచి కలెక్షన్లు రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. మొదటి రెండు రోజులు ప్రపంచవ్యాప్తంగా 2.39 కోట్ల షేర్ వసూలు చేసిన 'ఒక్కడు' సినిమా మొత్తం గా 3.71 కోట్ల గ్రాసును వసూలు చేసింది. బుకింగ్స్ బాగానే ఉన్నా సినిమా రికార్డులు మాత్రం బద్దలు కొట్టలేకపోయింది. ఇప్పటికి రీరిలీజ్ చిత్రాలలో 'ఖుషీ' సినిమా నే పెద్ద రికార్డులు సృష్టించింది.
'ఒక్కడు' సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల తరువాతే సంక్రాంతి సినిమాలో ఉండడంవల్ల 'ఒక్కడు' సినిమా రికార్డులు కొట్టలేక పోయిందని కొందరంటున్నారు. ఏది ఏమైనా ఈ రీరిలీజ్ ట్రెండ్‌లో మహేష్ కంటే పవనే ఒక మెట్టు పైన ఉన్నాడు అని చెప్పాలి. 'ఖుషి' పేరు మీద ఉన్న రీ రిలీజ్ రికార్డులు పవన్ సొంత పేరు మీదనే ఉన్నాయనేది వాస్తవం. మరి 'ఖుషీ' చిత్రాన్ని 'తొలిప్రేమ' దాటుతుందా లేక అది కూడా వెనుక పడుతుందా అనేది వేచి చూడాలి....! ఏది ఏమైనా రెండు చిత్రాలు పవన్ వే కాబట్టి పెద్దగా తేడా ఉండకపోవచ్చు.
![]() |
![]() |