![]() |
![]() |

తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన అనేక చిత్రాలకు కథలు అందించిన సీనియ రైటర్ బాలమురుగన్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేటి ఉదయం 8.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు, రచయిత భూపతి రాజా తెలిపారు.
బాలమురుగన్ తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు తదితర అగ్ర కథానాయకుల చిత్రాలకు కథలను అందించారు. వాటిలో ధర్మ దాత (70) అదృష్ట జాతకుడు (71), కోడలు పిల్ల (72), బంట్రోతు భార్య (74), సోగ్గాడు (75), ఆలుమగలు (77), సావాసగాళ్లు (77), జీవన తీరాలు (77), కాలయముడు (83), పుణ్యం కొద్దీ పురుషుడు (84), భార్యాభర్తలు (88) లాంటి చిత్రాలు ఉన్నాయి.
ఇక తమిళంలో ఒకప్పటి అగ్ర కథానాయకుడు శివాజీ గణేశన్ నటించిన 30కి పైగా సినిమాలకు బాలమురుగన్ కథలు అందించారు. బాలమురుగన్ మృతి చెందారు అన్న విషయం తెలుసుకున్న తమిళ, తెలుగు సినీ ప్రముఖులు పలువురు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
![]() |
![]() |