![]() |
![]() |

నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల శుక్రవారం 27వ పుట్టినరోజు జరుపుకుంది. డిసెంబర్ 9నే హైదరాబాద్‌కు చెందిన టెకీ చైతన్య జొన్నలగడ్డను ఆమె ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో పెళ్లాడింది. నిహారిక బర్త్‌డే సందర్భంగా ఆమె భర్త చైతన్య సోషల్ మీడియా ద్వారా మధురమైన శుభాకాంక్షలు తెలియజేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తమ ఇద్దరి క్యూట్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్‌ను చైతన్య షేర్ చేశాడు. ఆ పిక్చర్‌లో చైతన్య ఛాతీపై తలవాల్చి ఎంతో ఆనందంగా నవ్వులు కురిపిస్తూ ఉంది నిహారిక. ఆమెను పొదివి పట్టుకొని తానూ నవ్వుతున్నాడు చైతన్య.
"Happy Birthday, Love. నన్నెప్పుడూ సంతోషంగా ఉంచేట్లుగానే నీ పుట్టినరోజు నీకు సంతోషాన్నిస్తుంది. ప్రకాశించు నా సన్‌ఫ్లవర్" అంటూ నిహారికను పొద్దుతిరుగుడు పువ్వుతో పోలుస్తూ విషెస్ తెలియజేశాడు. సూర్యకాంతితో పొద్దుతిరుగుడు ఎలా వికసిస్తుందో, అలాగే ఆమె తన అడుగుపెట్టడంతో తన జీవితమూ అలా ప్రకాశిస్తోందని తన పోస్ట్ ద్వారా తెలియజేశాడు. కొద్ది సేపటికి చైతన్య పోస్ట్‌కు స్పందించింది నిహారిక. కామెంట్ సెక్షన్‌లో "Thank you so much, cutie!" అని రాసింది. నిహారిక మెట్టినింట అడుగుపెట్టాక వచ్చిన తొలి పుట్టినరోజు కావడంతో సంబరంగా దాన్ని జరుపుతున్నారు.
![]() |
![]() |