![]() |
![]() |

సింహా, లెజెండ్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నాయికలుగా నటిస్తున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సింహా, లెజెండ్ తరహాలో BB3( వర్కింగ్ టైటిల్)లోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. అందులో ఒకటి.. అఘోరా పాత్ర కాగా, మరొకటి ఐఏఎస్ ఆఫీసర్ రోల్ అని టాక్. అంతేకాదు.. ఈ రెండు పాత్రలు కూడా చాలా శక్తిమంతంగా ఉంటాయని బజ్. మరో విశేషమేమిటంటే.. ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించే పాత్రకి స్క్రీన్ నేమ్ కూడా బాలకృష్ణనే అని వినికిడి. త్వరలోనే ఈ విషయంపై మరింత క్లారిటీ వస్తుంది. మరి.. అఘోరాగా, బాలకృష్ణ ఐఏఎస్ గా బాలయ్య ఏ స్థాయిలో అలరిస్తారో తెలియాలంటే 2021 వేసవి వరకు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |