![]() |
![]() |

విక్టరీ వెంకటేష్ కెరీర్ లోని మెమరబుల్ హిట్స్ లో సుందరకాండ ఒకటి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో వెంకీకి జోడీగా మీనా నటించగా.. మరో నాయికగా అపర్ణ సందడి చేసింది. స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు.
సుందరకాండ కంటే ముందు.. వెంకీ, మీనా కాంబినేషన్ లో చంటి చిత్రం వచ్చింది. 1992 సంక్రాంతికి విడుదలైన చంటి వసూళ్ళ వర్షం కురిపించడమే కాకుండా.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తొలి కాంబినేషన్ లోనే వెంకటేష్ - మీనా జంటని హిట్ పెయిర్ ని చేసేసింది. ఇక అదే ఏడాదిలో వచ్చిన సుందరకాండ కూడా కాసుల వర్షం కురిపించింది. గాంధీ జయంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. కుటుంబ ప్రేక్షకుల మనసు దోచుకుంది. మరీ ముఖ్యంగా.. వెంకీ, మీనా కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలన్నీ అలరించేలా ఉంటాయి.
ఒకే ఏడాదిలో చంటి, సుందరకాండ.. ఇలా రెండు బ్లాక్ బస్టర్స్ తో వెంకీ, మీనా జోడీ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది. ఆ తరువాత వీరి కలయికలో మరో మూడు సినిమాలు (అబ్బాయిగారు, సూర్యవంశం, దృశ్యం) రాగా.. అవి కూడా ఘనవిజయం సాధించడం విశేషం.
![]() |
![]() |