![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు - యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. దూకుడు, బిజినెస్ మేన్, ఆగడు.. ఇలా వీరి కాంబోలో వచ్చిన సినిమాల్లోని పాటలన్నీ చార్ట్ బస్టర్సే. వీటిలో దూకుడు, బిజినెస్ మేన్ కమర్షియల్ గానూ మెప్పించగా.. ఆగడు ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మ్యూజికల్ గా మెప్పించింది. కట్ చేస్తే.. దాదాపు ఏడేళ్ళ విరామం అనంతరం మహేష్, తమన్ కలయికలో మరో సినిమా వస్తోంది. ఆ చిత్రమే.. సర్కారు వారి పాట.
పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సోషల్ డ్రామా జనవరిలో పట్టాలెక్కి.. ఆగస్టులో జనం ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. సర్కారు వారి పాట కోసం ఓ ఐటమ్ నంబర్ ని రికార్డ్ చేశాడట తమన్. అది మహేష్ తో సహా యూనిట్ సభ్యులందర్నీతెగ ఇంప్రెస్ చేసిందని టాక్. పువ్వై పువ్వై (దూకుడు), బ్యాడ్ బాయ్స్ (బిజినెస్ మేన్), జంక్షన్ లో (ఆగడు).. తరహాలో మహేష్, తమన్ కాంబినేషన్ లో ఈ ఐటమ్ నంబర్ కూడా చార్ట్ బస్టర్ కావడం ఖాయమంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో?
కాగా, సర్కారు వారి పాటలో మహేష్ బాబు కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.
![]() |
![]() |