![]() |
![]() |

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గురువారం 50వ బర్త్‌డే ఘనంగా జరుపుకున్నారు. 'దిల్ రాజు 50' పేరిట జరిగిన ఈ వేడుకలు ఆయన భార్య వైఘా రెడ్డి (తేజస్విని), కుమార్తె హన్షితా రెడ్డి, అల్లుడు అర్చిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. టాలీవుడ్‌లోని రాజు సన్నిహితులతో పాటు టాప్ సెలబ్రిటీలనందర్నీ ఈ వేడుకలకు ఆహ్వానించారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్నవారు, హైదరాబాద్‌లో లేనివారు తప్పితే మిగతా అగ్ర హీరోలు, హీరోయిన్లు ఈ వేడుకలకు విచ్చేసి, కన్నుల పండువ చేశారు.
దిల్ రాజు హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న వారిలో చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాగచైతన్య, సమంత, రామ్, విజయ్ దేవరకొండ, నితిన్ దంపతులు, వరుణ్ తేజ్, యష్, పూజా హెగ్డే, సునీల్, అఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్, రాశీ ఖన్నా, అంజలి, సంగీత, విష్వక్‌సేన్, అనుపమ పరమేశ్వరన్, నివేదా పేతురాజ్ తదితరులు ఉన్నారు.








![]() |
![]() |