![]() |
![]() |

బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ అజయ్ దేవ్‌గణ్ తక్కువ బడ్జెట్‌తో రూపొంది ఘన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ 'బ్రోచేవారెవరురా' హిందీ రీమేక్ హక్కులను స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్‌లో ఈ మూవీని ఆయన నిర్మించనున్నారు. ఇందులో హీరోగా ఆయన ఎవర్ని తీసుకుంటున్నారో తెలుసా? సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్‌ను. తెలుగులో శ్రీవిష్ణు పోషించిన పాత్రను కరణ్ చేయనున్నాడు. సత్యదేవ్ చేసిన పాత్రను అభయ్ డియోల్ చేయనున్నాడు. ఈ మూవీకి 'వెల్లే' అనే టైటిల్ నిర్ణయించారు.
యస్.యస్. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ 'ఆర్ఆర్ఆర్' మూవీలో అజయ్ దేవ్‌గణ్ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వచ్చినప్పుడు 'బ్రోచేవారెవరురా' సినిమా చూసిన ఆయన వెంటనే దాని రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీ వెర్షన్ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. 'చల్తే చల్తే', 'ఓం శాంతి ఓం' చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా వర్క్ చేసిన దేవేన్ ముంజాల్ 'వెల్లే' ద్వారా డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు.
వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన 'బ్రోచేవారెవరురా' మూవీలో శ్రీవిష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియేట్ తప్పుతూ అక్కడే అదే కాలేజీలో సంవత్సరాల తరబడి చదువుతూ ఉండే ముగ్గురు మిత్రులు ఒక టాస్క్ విషయంలో ఎలాంటి విపరీత పరిస్థితులు ఎదుర్కొన్నారనే అంశంతో క్రైమ్ కామెడీగా ఈ సినిమా రూపొందింది.
![]() |
![]() |