![]() |
![]() |

యష్ హీరోగా రూపొందించిన కన్నడ సినిమా 'కేజీఎఫ్'తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒక కన్నడ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో హిట్టవడం చరిత్రలో ఇదే మొదటిసారి. 'కేజీఎఫ్'తో యష్‌కు పాన్ ఇండియా స్టార్ రేంజ్ తీసుకువచ్చిన ఆయన ఇప్పుడు, అతడితోటే 'కేజీఎఫ్: చాప్టర్ 2' తీస్తున్నాడు. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తవనున్నది.
ఆ వెంటనే ప్రభాస్‌తో 'సలార్' షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్. 'రాధే శ్యామ్'ను కంప్లీట్ చేసి 'సలార్' షూటింగ్‌ను జనవరిలో సంక్రాంతి తర్వాత ప్రారంభించాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు.
లేటెస్ట్‌గా మరో సినిమాని ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు ప్రశాంత్. అయితే డైరెక్టర్‌గా కాదు, కథకుడిగా! అవును. 'బఘీరా' అనే సినిమాకు అతను కథను అందిస్తున్నాడు. కన్నడంలో స్టార్ హీరో అయిన శ్రీమురళి హీరోగా నటించే ఈ సినిమాకు డాక్టర్ సూరి దర్శకుడు. 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలను నిర్మిస్తోన్న హోంబళే ఫిలిమ్స్ ఈ మూవీనీ నిర్మించనున్నది.
గురువారం శ్రీమురళి బర్త్‌డే. ఈ సందర్భంగా 'బఘీరా' ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. "సమాజం అడవిగా మారినప్పుడు ఒకే ఒక్క ప్రిడేటర్ న్యాయం కోసం గర్జిస్తాడు" అంటూ దానికి క్యాప్షన్ పెట్టారు.
![]() |
![]() |