![]() |
![]() |

పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నెవా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం కెమెరా కంటికి చిక్కారు. ఆమెతో పాటు కుమార్తె పొలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ కూడా ఉన్నారు. ఆ ఇద్దరితో కలిసి ఎయిర్‌పోర్ట్ బయటకు వస్తున్న అన్నా లెజ్నెవా ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. రష్యాలో ఉన్న పుట్టింటికి వెళ్లి ఆమె తిరిగి హైదరాబాద్ వచ్చారు. అయితే పిక్చర్స్‌లో అన్నా రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రష్యన్ వనిత అయినప్పటికీ, ఇప్పటివరకూ ఆమె తెలుగింటి సంప్రదాయాన్ని పాటిస్తూ, చీరకట్టులో, జడ అల్లిన జుట్టుతోటే కనిపిస్తూ వచ్చారు. కానీ ఎయిర్‌పోర్ట్‌లో ఆమె పూర్తి భిన్నమైన లుక్స్‌తో కనిపించారు. దగ్గరగా కత్తిరించిన జుట్టు, టీ షర్ట్ పైజమా వేషధారణలో ఆమె పూర్తి మోడ్రన్ లుక్‌లో ఉన్నారు. ఆమె లుక్ చూసి అందరూ స్టన్నవుతున్నారు.

కాగా ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన నిహారిక పెళ్లి వేడుకకు పవన్ కల్యాణ్ తన రెండో భార్య రేణు దేశాయ్‌తో కలిగిన పిల్లలు అకిర నందన్, ఆద్యలతో వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ అన్నా కానీ, ఆమె పిల్లలు కానీ కనిపించలేదు. దానికి కారణం వారు రష్యాలో ఉండటమే. కానీ కొంతమంది పవన్, రేణు మళ్లీ దగ్గరవుతున్నారనీ, అన్నాతో పవన్ విడిపోనున్నారంటూ సోషల్ మీడియాలో వదంతులు పుట్టించారు. ఆ వదంతులకు చెక్ చెపుతున్నట్లుగా అన్నా లెజ్నెవా రష్యా నుంచి వచ్చేశారు. దీంతో పవన్, లెజ్నెవా మధ్య బంధం చెక్కుచెదరలేదని అర్థమైపోతోంది.
లెజ్నెవాను జనసేన అధ్యక్షుడు 2013లో పెళ్లాడారు. అప్పటికే పవన్‌తో ఆమెకు పొలెనా అంజనా జన్మించిందని వినికిడి. 2017లో మార్క్ శంకర్ పుట్టాడు.

![]() |
![]() |