![]() |
![]() |
.jpg)
జూనియర్ ఎన్టీఆర్ టీవీ వీక్షకులను మరోసారి అలరించనున్నాడు. ఓ పేరుపొందిన ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ కోసం తారక్ ఓ టాక్ షో చేయనున్నాడు. ఇదివరకు తారక్ స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ 1కు హోస్ట్‌గా వ్యవహరించి, ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ త్వరలో ప్రసారం చేయబోతున్న టాక్ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. అలా మరోసారి బుల్లితెర ఆడియెన్స్‌ను మురిపించేందుకు సిద్ధమవుతున్నాడు.
కాగా బిగ్ బాస్ షోకు భారీ స్థాయిలో చార్జ్ చేసిన తారక్.. ఈ టాక్ షోకు పారితోషికం తీసుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే అది నిజమేనని ఇన్‌సైడర్స్ టాక్. ఎందుకంటే.. ఆ టాక్ షోకు నిర్మాత కూడా ఆయనేనంట. అందుకే రెమ్యునరేషన్ ప్రస్తావన రావట్లేదు. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.
రాజమౌళి డైరెక్షన్‌లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఇందులో గోండు వీరుడు కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందు టాక్ షో చేయడానికి తారక్ ప్లాన్ చేశాడు.
![]() |
![]() |