బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొవిడ్-19 నెగటివ్ అని టెస్ట్‌లో తేలడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొదటగా ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ఆదివారం తెలిపారు. అమితాబ్ ఈ రోజు సాయంత్రం ముంబైలోని తన నివాసం జల్సాకు చేరుకున్నారు. "లేటెస్ట్ కొవిడ్-19 టెస్ట్‌లో మా నాన్న నెగటివ్ అని తేలింది. హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఆయన ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటారు. ఆయన కోసం ప్రార్థించిన, విషెస్ తెలిపిన మీ అందరికీ థాంక్స్" అని ట్వీట్ చేశాడు అభిషేక్.
ఆ తర్వాత అమితాబ్ కూడా తనకు సపోర్ట్‌గా ఉన్న, తన గురించి ప్రార్థనలు చేసిన శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. "నేను కొవిడ్ నెగటివ్ అని తేలి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. I am back home in solitary quarantine. భగవంతుడి దయ, మా బాబూజీ ఆశీస్సులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానుల ప్రార్థనలు, నానావతి (హాస్పిటల్)లో అద్భుతమైన శ్రద్ధ, నర్సింగ్ వల్ల ఇది చూడటం నాకు సాధ్యమైంది" అని తన సోషల్ మీడియా అకౌంట్లో ఆయన రాశారు.
44 ఏళ్ల అభిషేక్ తన తండ్రి అమితాబ్‌తో పాటే నానావతి హాస్పిటల్లో జూలై 11న అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత కొవిడ్-19 పాజిటివ్‌గా తేలి లక్షణాలు కనిపించిన ఐశ్వర్య రాయ్, ఆరాధ్య కూడా అదే హాస్పిటల్లో చికిత్స తీసుకొని, ఇటీవల నెగటివ్‌గా తేలడతో డిశ్చార్జ్ అయ్యారు. అయితే అభిషేక్ మాత్రం ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. నేటి టెస్ట్‌లో అతనింకా పాజిటివ్‌గానే ఉన్నట్లు వెల్లడైంది.