'అవతార్ 2'లోని మూడు సీన్లను విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తన టెక్నీషియన్లకు చూపించారు. ఈ విషయాన్ని ఆ మూవీ ప్రొడ్యూసర్ జోన్ లాండౌ తెలిపారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. కరోనా వైరస్‌ను నిరోధించడంలో విజయం సాధించిన అతి కొద్ది దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి కావడంతో, అక్కడ పెద్దగా సురక్షిత చర్యలు చేపట్టాల్సిన పని లేకుండానే పని చేసుకుపోతున్నారు.
అయినప్పటికీ దురదృష్టవశాత్తూ కరోనా మహమ్మారి కారణంగానే 'అవతార్ 2' సినిమా విడుదల 2021 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్‌కు వాయిదా పడింది. ఈ ఆలస్యం కారణంగా మిగతా సీక్వెల్స్ అన్ని కూడా ఒక్కో ఏడాది పాటు వెనక్కి జరిగాయి. అంటే 'అవతార్' రిలీజ్ అయిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 'అవతార్ 5' విడుదలయ్యే అవకాశం ఉంది.
దీంతో ఓవైపు ప్రొడక్షన్ జరుగుతుండగానే ఫస్ట్ సీక్వెల్‌కు సంబంధించిన మూడు సీన్లను కామెరాన్ తన సిబ్బందికి చూపించారు. ఇవి విజువల్ ఎఫెక్ట్స్ జోడించిన పూర్తి స్థాయి సీన్లని ప్రొడ్యూసర్ లాండౌ చెప్పారు. వాటిని చూశాక క్రూ మెంబర్స్ అందరిలోనూ కొత్త ఉత్తేజం వచ్చిందనీ, మిగతా సన్నివేశాలు మరింత బాగా తీసుకురావాలనే ఆరాటం వారిలో మొదలైందనీ ఆయన తెలిపారు. తన విజన్‌కు ప్రాణం పోయడం కోసం కొత్త టెక్నాలజీలో కామెరాన్ భారీగా డబ్బులు పెడుతున్నారు. వాటిలో అండర్‌వాటర్ షూటింగ్ కోసం కొత్త టెక్నిక్స్ కూడా ఉన్నాయి.
సవరించిన షెడ్యూల్ ప్రకారం అవతార్ సీక్వెల్స్ రిలీజ్ డేట్స్
అవతార్ 2: 2022 డిసెంబర్ 16
అవతార్ 3: 2024 డిసెంబర్ 20
అవతార్ 4: 2026 డిసెంబర్ 18
అవతార్ 5: 2028 డిసెంబర్ 22