చకచకా ఒకదాని తర్వాత ఒకటిగా షార్ట్ వెబ్ మూవీస్ తీసుకుంటూ వెళ్తోన్న రామ్‌గోపాల్ వర్మ లేటెస్ట్‌గా తన గన్‌ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు గురిపెట్టారు. అయితే డైరెక్ట్‌గా ఎవరి పేర్లనూ ఉపయోగించకుండా సినిమాలు తీస్తూ చట్టానికి దొరక్కుండా తప్పించుకొనే ఆయన ఈసారీ అదే పని చేస్తున్నారు. అయితే ఆయన గురి ఎవరి మీదనో మనకు మాత్రం అర్థమైపోతుండటం ఆయన నేర్పరితనం. ఇటీవలే ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో 'పవర్ స్టార్' ఫిల్మ్‌ను రిలీజ్ చేసిన ఆయన ఇప్పుడు 'అల్లు' అనే ఫిల్మ్‌ను అనౌన్స్ చేశారు.
"ఆర్జీవీ వరల్డ్ థియేటర్ తదుపరి ఫిక్షనల్ రియాలిటీ (ఎఫ్ఆర్) ఫిలిమ్స్‌లో మరొకటి 'అల్లు'. ఒక చాలా పెద్ద స్టార్ ఫ్యామిలీ వెనుక నుంచి ఒక బావమరిది ఏం చేస్తుంటాడనే ఫిక్షనల్ స్టోరీ ఇది. ఆ స్టార్ 'జన రాజ్యం' పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఈ కథ మొదలవుతుంది" అని ఆయన తెలిపారు. ఈ ఫిల్మ్‌కు 'అల్లు' అనే టైటిల్ ఎందుకు పెట్టారో ఆయన చెప్పారు. “అల్లు” అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ “అల్లు”తూ వుంటాడు.. అని ఆయన ట్వీట్ చేశారు.
అంతటితో ఆయన ఆగలేదు. "తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటజీతో ప్లాన్ ల అల్లుడు ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు. అందరితో తనని "ఆహా" అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ అల్లు".. అని పేర్కొన్నారు.
ఆ ఫిల్మ్‌లోని క్యారెక్టర్ల పేర్లను కూడా ఆర్జీవీ వెల్లడించారు. “అల్లు" will have characters called.. A Aaravind, K Chiraaanjeevi, Prawan Kalyan, A Aaarjun, A Sheeresh, K R Chraran, N Baebu, and etc etc.. అని ఆయన చెప్పారు.
"అల్లు అనేది నాన్ ఫిక్షనల్ ఫిల్మ్ కాదని వాస్తవికంగా ఆలోచించే కొంతమంది లాగా, నన్ను నికృష్టుడు అని పిలిచినందుకు రివెంజ్ తీర్చుకోడానికి ఈ ఫిల్మ్‌ను నేను తీయడం లేదు. and I swear this on my love for the family" అని వర్మ చెప్పారు. "అల్లులో థియేటర్ మాఫియా ఉండదనీ, పార్టీ టిక్కెట్లు అమ్ముకోవడం ఉండదనీ, వెన్నుపోటు రాజకీయాలు ఉండవనీ, అన్నదమ్ముల మధ్య సమస్యలకు కారణమవడం ఉండదనీ నేను చెప్పను" అని తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు ఆర్జీవీ.
సో.. రానున్న రోజుల్లో పవర్ స్టార్ తరహాలో మరిన్ని మసాలా 'అల్లు' ట్వీట్లను మనం రుచి చూడబోతున్నామన్న మాట.