సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసు ఆయన తండ్రి కె.కె. సింగ్, నటి అంకితా లోఖండే వంటి కొంతమంది చేసిన ఆరోపణలతో పూర్తిగా కొత్త మలుపు తీసుకుంది. ఈ విషయంలో ఓ బిగ్ నేమ్ ప్రమేయం ఉందనీ, అందువల్ల ముంబై పోలీసులు తమ దర్యాప్తు విషయంలో రాజీపడవచ్చనీ వెల్లడైంది. ఆ రిపోర్ట్ ప్రకారం సుశాంత్ చనిపోవడానికి ముందు రోజు రాత్రి ఇచ్చిన పార్టీలో అదే పెద్ద మనిషి పాల్గొన్నాడు.
ఆ టైమ్‌లో ఒక రాజకీయ నాయకుడి కుమారుడు సుశాంత్ అపార్ట్మెంట్లో ఉన్నాడని ప్రచారంలోకి వచ్చింది. షాకింగ్ అనిపించే విషయమేమంటే సరిగ్గా అదే టైమ్‌లో సీసీటీవీ పనిచేయకపోవడం. ఆ వ్యక్తి పేరును మరుగుపరచడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్ సన్నిహితులు కొంతమంది చెప్తున్న దాని ప్రకారం, ఆ ప్లేస్‌లో ఒక పార్టీ జరిగిందనీ, అందులో ఒక పవర్‌పుల్ పర్సనాలిటీ కూడా హాజరయ్యాడు.
అన్నిటికీ మించి, సుశాంత్సింగ్కూ, ఆ వ్యక్తికీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంకో దిగ్భ్రాంతికరమైన విషయం, ఒక చేతబడిలో రియా చక్రబర్తి ప్రమేయం ఉందనేది బయటపడటం. కొన్ని నెలల క్రితం సుశాంత్ సింగ్ ఇంటి పనివాళ్ల నుంచి ఈ విషయం తనకు తెలిసిందని పాట్నా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో అతని సోదరి చెప్పినట్లు వెల్లడైంది.