కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ నుంచి ఇప్పటి దాకా నాలుగు నెలల పాటు షూటింగ్ నిలిచిపోవడంతో వరుణ్ తేజ్ కొత్త సినిమా టీమ్ ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్దామా అని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. వరుణ్ తేజ్ 'బాక్సర్'గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌లో పునరుద్ధరించడానికి అన్ని రకాల ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేయనున్నారు.
హైదరాబాద్, ఢిల్లీలో రెండు షెడ్యూళ్లను చిత్ర బృందం ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 15 నుంచి హైదరాబాద్ షెడ్యూల్ మొదలవుతుంది. కరోనా తగ్గుముఖం పట్టాక ఢిల్లీ షెడ్యూల్ జరగనుంది. మొత్తం 30 మంది ఉండే యూనిట్‌తో పాటు ఒక డాక్టర్ కూడా సెట్స్ మీద ఉంటారని డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెలిపాడు. దబాంగ్ 3లో సల్మాన్ ఖాన్ సరసన నటించడం ద్వారా పరిచయమైన సయీ మంజ్రేకర్ ఈ మూవీలో వరుణ్ జోడీగా కనిపించనున్నది. ఇది ఆమె టాలీవుడ్ డెబ్యూ మూవీ.
ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి లాంటి మహామహులు నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విశాఖపట్నంలో మొదలైంది. కొద్ది రోజులు షూటింగ్ చేశారో లేదో లాక్డౌన్ వచ్చేసింది. అల్లు వెంకటేశ్, సందీప్ ముద్దా సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.