![]() |
![]() |

ఒక్కొక్కరిది ఒక్కో విధమైన శైలి. కొందరు ఒక చేత్తో చేసిన దానాన్ని రెండో చేతికి తెలియకూడదు అంటారు. మరికొందరు తాము సహాయం చేస్తున్నామని తెలిస్తే తమ అభిమానులు కూడా తమ తరహాలోనే ఆలోచించి వారికి తోచిన సాయం వారు కూడా చేస్తారని పబ్లిసిటీ కోసం కొన్ని గొప్ప కార్యక్రమాలను బయటపెడుతూ ఉంటారు. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతటి సాయం చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ లను నడపడం అనేది అంత సులభం కాదు. రోజుకు ఖర్చు లక్షల్లో ఉంటుంది. ఇక ఇటీవల కరోనా సమయంలో ఆక్సిజన్ అందక పలువురు రోగులు మరణిస్తుంటే చిరంజీవి ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలలో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు కూడా తనదైన సాయం చేశారు. ఇక ఈ విషయంలో మన టాలీవుడ్ హీరోలు వెండితెరపైనే కాదు రియల్ లైఫ్ లోను హీరోలే అని చెప్పాలి. కానీ బాలయ్య మాత్రం తన పేరు బయటికి రాకుండా పబ్లిసిటీకి దూరంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మహేష్ బాబు వేయి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు. ఇంకా చేయిస్తూనే ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కోసం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కోసం తాను సంపాదించిన డబ్బునంత వారికి దానాలు చేస్తూ వస్తున్నారు. ఇక యంగ్ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ కూడా కోవిడ్ నుంచి తనదైన పంథాలో మిడిల్ క్లాస్ కి సాయం చేస్తూ వస్తున్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ ఏకంగా తన తల్లి బసవతారకం పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ ను కట్టి దాని ద్వారా సేవ చేస్తున్నారు. ఎంతోమందికి డబ్బులు లేకుండా ఆపరేషన్లు, క్యాన్సర్ చికిత్సలు చేయిస్తున్నారు. మరోవైపు డబ్బులు కూడా ఇస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. రీసెంట్ గా క్యాన్సర్ కి గురైన ఓ అమ్మాయికి తన సొంత ఖర్చులతో వైద్యం చేయించాడురు. వారిని అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్- గోపీచంద్ ఎపిసోడ్ కి ఫ్యామిలీతో సహా ఆహ్వానించి వారికి మరికొంత ధనం అందించి తన సహృదయం చాటుకున్నారు. సహాయం అడగకపోయినా ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఆయన స్పందిస్తుంటారు. రీసెంట్ గా మరోసారి బాలకృష్ణ తన గొప్ప మనసు చాటుకున్నాడు. అనంతపురం కు చెందిన ఓ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతూ బోన్ క్యాన్సర్ తో బాధపడుతోంది. ఈ ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు 10 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారట. కానీ వారికి ఆ ఆర్థిక స్తోమత లేదు. దాంతో పాపకు చికిత్స చేయించలేకపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ వెంటనే వారికి ఫోన్ చేశారట. విషయం తెలుసుకొని పాప ట్రీట్మెంట్ కోసం డాక్టర్లతో మాట్లాడి వెంటనే ట్రీట్మెంట్ ని మొదలు పెట్టించారు. ఈ విషయం తెలిసిన బాలయ్య అభిమానులు జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా నంద్యాలలో ఓ బాలయ్య అభిమాని బేనర్లు కడుతూ కిందపడి గాయపడ్డాడు. అతడిని వెంటనే హైదరాబాద్ కి పిలిపించిన బాలయ్య అతని యోగక్షేమాలు కనుగొని విచారించి తనకు తోచిన సాయం చేసి పంపారట.
![]() |
![]() |