పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి వింటే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే లైన్‌లో ఉన్న సినిమాలన్నీ భారీ నుంచి అతి భారీ బడ్జెట్ సినిమాలే. అన్నీ వందల కోట్లతో నిర్మాణం జరుపుకుంటున్న సినిమాలే. పాన్ ఇండియా స్టార్‌గా తన స్టామినా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన ప్రభాస్ మార్కెట్‌కి తగ్గట్టుగా బడ్జెట్‌ని ఎంతైనా పెట్టేందుకు నిర్మాతలు సిద్ధపడుతున్నారు. అయితే తమ సినిమాలో కొన్ని ప్రత్యేకతలు ఉండాలని మాత్రం అనుకుంటున్నారు. ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఐదారు సినిమాలు ఉన్నాయి. వాటిలో మొదట రిలీజ్ అయ్యే సినిమా ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కథ, కథనాల గురించి రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. దాన్ని బట్టి రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతోందనే ప్రాథమిక అంచనాకి వస్తున్నారంతా.
ప్రభాస్ ఇంతవరకు చేయని ఓ కొత్త తరహా క్యారెక్టర్ రాజా సాబ్‌లో చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఈ సినిమాలో టోటల్‌గా 6 పాటలుంటాయి. అందులో ఒక రీమిక్స్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. అయితే ఏ పాటను రీమిక్స్ చేశారనేది ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇందులోనే ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా, సినిమా బడ్జెట్‌కి తగ్గట్టుగా ఆ స్పెషల్ సాంగ్ కోసం ఎవరూ ఊహించని ఒక స్టార్ హీరోయిన్‌ని రంగంలోకి దింపే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. అందర్నీ షాక్‌కి గురిచేసే ఆ హీరోయిన్ ఎవరో కాదు.. నయనతార. 17 సంవత్సరాల క్రితం ‘యోగి’ చిత్రంలో ప్రభాస్‌తో జతకట్టిన నయన్‌తోనే ఆ పాట చేయించాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇక నయన్ విషయానికి వస్తే.. ఈమధ్యకాలంలో ఆమె లీడ్ రోల్స్‌తో వచ్చిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. 40 ఏళ్ళ వయసులోనూ ఇప్పటికీ ఫిట్‌గా ఉన్న నయన్ ప్రస్తుతం అరడజన్‌కు పైగా సినిమాలు కమిట్ అయి ఉంది. హీరోయిన్‌గా తప్ప ఇప్పటివరకు ఏ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చెయ్యని నయనతారను రాజాసాబ్ కోసం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. గతంలో తన డైరెక్షన్‌లో వచ్చిన ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం నయన్‌ని అప్రోచ్ అయ్యారట మారుతి. కానీ, ఆ ఆఫర్‌ను నయన్ తిరస్కరించింది. ఇప్పుడు ప్రభాస్ కోసం ఆమె స్పెషల్ సాంగ్ చేస్తుందా అనే అనుమానం యూనిట్‌లో అందరికీ ఉంది. ఎలాగైనా ఆమెను ఒప్పించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటివరకు రాజాసాబ్‌కి సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్, గ్లింప్స్, మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రాజా సాబ్‌కి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను సంక్రాంతికి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక సినిమాను ఏప్రిల్ 10న సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.