గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్(game changer)సంక్రాంతి కానుకగా జనవరి పది న విడుదల కాబోతుంది.దిల్ రాజు(dil raju)నిర్మాణ సారధ్యంలో ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్(shankar)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మూవీ మీద,మెగాఅభిమానులతో పాటుప్రేక్షకుల్లో కూడా అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. చరణ్ సరసన కియారా జత కట్టగా అంజలి, ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరగబోతుందని,ఆ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)చీఫ్ గెస్ట్ గా రానున్నాడనే రూమర్స్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై రామ్ చరణ్ గాని చిత్ర బృందం గాని ఇప్పటి వరకు అధికారకంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.కానీ పవన్ రావడం పక్కా అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఒక వేళ ఆ రూమర్ నిజమయ్యి గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ కి పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్ హాజరైతే కనుక ఒక సంచలనమే అవుతుందని చెప్పవచ్చు.
ఎందుకంటే గతంలో రామ్ చరణ్ హిట్ మూవీ రంగస్థలంకి సంబంధించిన ఫంక్షన్లో పవన్ మాట్లాడిన మాటలని మెగా ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోలేరు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా శంకర్ స్టైల్లో కనివిని ఎరుగని రీతిలో భారీగాఉండబోతుందని తెలుస్తుంది. కొన్నిరోజుల క్రితం లక్నోలో టీజర్ రిలీజైన విషయం తెలిసిందే.