రీసెంట్ గా 'దేవర'తో మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేతిలో ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో పాటు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయనున్న 'డ్రాగన్', కొరటాల శివతో 'దేవర-2' ఉన్నాయి. వీటితో పాటు, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో సినిమాకి కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యవ్ (Shouryuv) డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడని గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలు నిజమేనని, ఎన్టీఆర్-శౌర్యవ్ కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అయిందని వినికిడి. ఓ రకంగా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వరుస భారీ యాక్షన్ సినిమాల మధ్య, శౌర్యవ్ లాంటి యువ దర్శకుడితో సినిమా చేస్తే.. ఏదైనా కొత్త సబ్జెక్టు లేదా కొత్త పాత్రలో ఎన్టీఆర్ ని చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది.
ఎన్టీఆర్-శౌర్యవ్ కాంబోలో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని 'హాయ్ నాన్న' చిత్రాన్ని నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట.