అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు విక్టరీ వెంకటేష్ (Venkatesh). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. తాజాగా మరో సినిమాకి వెంకటేష్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని 'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. విమల్ చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన వెంకీ మామ, సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చిట్టూరి శ్రీనివాస్ నిర్మించనున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట. 2025 ప్రారంభంలో ఈ సినిమా మొదలుపెట్టి, అదే ఏడాది చివరిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
వెంకీ మామ కామెడీ టైమింగ్ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అలాగే విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన 'డీజే టిల్లు'లో కూడా కామెడీ ఓ రేంజ్ లో పండింది. అలాంటిది వెంకటేష్-విమల్ కృష్ణ కలిస్తే కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు.